దుబాయ్ కి పంపిస్తానని చెప్పి ముగ్గురు యువకుల నుంచి కొంత నగదు తీసుకొని ఓ గల్ఫ్ ఏజెంట్ ఘరానా మోసం చేసిన సంఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని మాలపల్లి కి చెందిన ముషిరాహైమద్ అనే ఏజెంట్ నాగారం కు చెందిన అలకుంట అశోక్,సాయిబాబా,ఫయాజ్ లను దుబాయ్ కి పంపిస్తా నని చెప్పి వారినుంచి రూ.60,000 నగదు తీసుకొని నేడు రేపు అనుకుతుంటూ మూడు నెలలు గడిచినా ఎలాంటి సమాధానం చెప్పక పోవడంతో బాధితులు శుక్రవారం ఇంటికి వెళ్ళారని తెలిపారు.
దానితో ముషిరాహైమద్,అతని భార్య మరియ,కుమారుడు ఫైజన్ ఇతరులు కలిసి బాధితుల పై దాడి చేసినట్లు తెలిపారు. దానితో బాధితులు ఒకటవ టౌన్ లో ఫిర్యాధు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
