తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు నిజామాబాద్ జిల్లాలో ను పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ రూపం లో సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది *పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికి గతంలో ఉన్న రెండు లక్షల ప్రమాద బీమ ఈసారి 5 లక్షలకు పెంచారు
క్రియాశీల కార్యకర్తలు ఎవరైనా మరణిస్తే వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 ఇచ్చే విధంగా కార్యచరణ రూపొందించారనీ అన్నారు
సభ్యత్వ నమోదు మరియు పునరుద్ధరణ అక్టోబర్ 26 నుండి 40 రోజులు చేసుకోవడానికి సమయం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి సాధికారత ద్వార నైపుణ్య శిక్షాణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది.
కావున ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని, తెలుగుదేశం పార్టీని ఆదరించాలని పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్ అన్నారు..
తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని చూసి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి మైనార్టీ నాయకులు పార్టీలోకి రావడం జరిగింది, వీరిని పార్లమెంట్ కన్వీనర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో మాజీ నియోజకవర్గ ఇన్చార్జిలు వినోద్ కుమార్, కోట గోపాల్ రెడ్డి, మాజీ పార్లమెంట్ కమిటీ నాయకులు పావులూరు వెంకటేశ్వరరావు, జ్యోతి నారాయణ, బ్రహ్మానంద చారి,వీర చారి, మాజీ పట్టణ అధ్యక్షులు అంబిక సత్యనారాయణ, మాజీ అనుబంధ సంఘ అధ్యక్షులు బొబ్బా నరసింహ, శ్రీనివాస్ బాబు, సచిన్ పటేల్, రావెళ్ల శ్రీను, పసుల రాజు, దంతాల ఆనంద్, మాజీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, గోవర్ధన్ గౌడ్, సత్యనారాయణ, జవిద్, సురేష్, రావల్లే శ్రీను, లవంగ రాజు, శంకర్ ముదిరాజ్, పోదాని సత్యం, చందు, ఇప్పలపల్లి విష్ణు, ఫెరోస్, లక్ష్మీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.*
