HomeTelanganaNizamabadకుల జనగనణతోబిసి కులాల జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లోరిజర్వేషన్ అమలు చేయాలనిబిఎల్ఎఫ్ చైర్మన్ -నల్లా సూర్యప్రకాష్...

కుల జనగనణతోబిసి కులాల జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లోరిజర్వేషన్ అమలు చేయాలనిబిఎల్ఎఫ్ చైర్మన్ -నల్లా సూర్యప్రకాష్ డిమాండ్

తెలంగాణ సమాజంలో 93% ఉన్న బిసి ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలు అగ్రకులపేదలైన బహుజన ప్రజలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా పంపిణీ చేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు.


ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు, భవనాల అతిథి గృహంలో నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల జనగణమనతో బిసి కులాల జనాభా దామాషా ప్రకారం పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ప్రాతినిద్యం కల్పించాలని డిమాండ్ చేశారు.


చట్టసభల్లో ప్రాతినిద్యం లేని కొన్ని బిసి కులాలు ఎస్సీ ,ఎస్టీల కంటే రాజకీయ,ఆర్థిక, సామాజిక సాంస్కృతికంగా అత్యంత వేపుకు బాట తనాన్ని అనుభవిస్తున్నారని దానికి కారణం ఇప్పటి వరకు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ బిజెపి టీఆర్ఎస్ టిడిపి వైసిపి తదితర ఆధిపత్య రాజకీయ పార్టీలేనని విమర్శించారు.

బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ లు దండి వెంకట్, వనం సుధాకర్, రాష్ట్ర నాయకులు ఎస్.సిద్ది రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్
ప్రకారం సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయలు ,ఐదు సంవత్సరాలకుగాను లక్ష కోట్ల రూపాయలను బిసి కులాల ఆర్థికాభివృద్ధి కోసం కేటాయిస్తామని, ప్రభుత్వ వివిధ కాంట్రాక్ట్ పనుల్లో 42 % రిజర్వేషన్లు అమలు చేస్తామని వాగ్దానం చేశారని తెలిపారు.


అదేవిధంగా కుల జనగణన ద్వారా బిసి కులాలకు అసెంబ్లీ, పార్లమెంట్ లాంటి చట్టసభలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకురాలు సబ్బని లత, మేత్రి రాజశేఖర్, మారోజు సునిల్ కుమార్, బిఎల్ఎఫ్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా నాయకులు కె.శ్రినివాస్, వడ్ల సాయి కృష్ణ, జబ్బార్ నాయక్, దండు జ్యోతి, నాగరాపు ఎల్లయ్య, బి.జగదీష్, మోషిన్, చంద్ర గౌడ్, జి. శ్రీమాన్, ఎస్. డి. సయ్యద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments