పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ మహా ధర్నా చేపట్టింది.
ప్రధాన రహదారి మీద బైఠాయించడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు ఇందుర్ నగరంలొ ర్యాలీ తో వెళ్లి NTRచౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు b. శివ మరియు ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్ మాట్లాడుతూ* రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7800 వేల కోట్లు స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచితలకు కాకుండా విద్యార్థులకు పక్షాన ఉండి ఈ ప్రభుత్వం వెంటనే ఫీజు రివర్స్మెంట్ విడుదల చేయాలని కోరడం జరిగింది
అదేవిధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరిగింది.
ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో రాజకీయ నాయకుల స్వార్థాల కోసం విద్యార్థి జీవితాలతో చెలగాటాలు ఆడితే ఊరుకునేది లేదని రాష్ట్రం సాధించుకుంది విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని ఉద్యోగాలు వస్తాయని కానీ రాష్ట్రాలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల జీవితాలు మారడం లేదు ఎందుకని ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాటం చెప్తామని తెలిపారు.
ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీరు ఇచ్చే భిక్ష కాదని అది మా హక్కూ అని అవి విడుదల చేయకపోతే ఉద్యమాలు ఉద్రిక్తమైతాయని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో నాగరాజు, అలంకార్, గణేష్, ప్రవీణ్, సాయి, సామిర్, అజయ్, శివ తదితర విద్యార్థులు పాల్గొన్నారు
