HomeTelanganaNizamabadటీజీపీఎస్పీ కానిస్టేబుల్స్ డిస్మిస్, సస్పెండ్ లను ఎత్తివేయాలి.. - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

టీజీపీఎస్పీ కానిస్టేబుల్స్ డిస్మిస్, సస్పెండ్ లను ఎత్తివేయాలి.. – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

టీజీపీఎస్పీ కానిస్టేబుల్స్ డిస్మిస్, సస్పెండ్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేసి వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.గత కొద్ది రోజులుగా TGSP కానిస్టేబుల్స్ చేస్తున్న నిరసనలపై ఆయన స్పందించారు….

శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలిసన్నలు రోడ్డెక్కి ధర్నాలకు దిగితే వారి మానసిక క్షోభ అర్ధం చేసుకునేది పోయి ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం అన్యాయమని తెలిపారు.

అలాగే పునర్విభజన వల్ల తమకు అన్యాయం జరుగుతుందని కుటుంబాలకు దూరం అవుతున్నామని వారి భార్య పిల్లలు రోడ్డెక్కితే వారి వ్యక్తిగత జీవితాలను అర్ధం చేసుకోకుండా 39 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేయడం, 10 మందిని డిస్మిస్ చేయడం అన్యాయమని ఖండించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ న్యాయపరమైన డిమాండ్స్ ను పరిగణలోకి తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.

అదేవిధంగా సస్పెండ్ చేసిన 39మందిని అలాగే డిస్మిస్ చేసిన 10 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments