HomeTelanganaNizamabadబీసీ కమిషన్ నిక్కచ్చిగా పనిచేస్తుంది...బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్...

బీసీ కమిషన్ నిక్కచ్చిగా పనిచేస్తుంది…బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్…

తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎక్కడ అవినీతికి తావులేకుండా నిక్కచ్చిగా,నిజాయితీగా పనిచేస్తుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణ లో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు..బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణ లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 128 అప్లైకేషన్ లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.అందులో నిజామాబాద్ జిల్లా నుంచి 102,కామారెడ్డి జిల్లా నుంచి 26 అప్లైకేషన్ లు వచ్చాయని తెలిపారు.ముఖ్యంగా వచ్చిన అప్పీకేషన్లో బీసీ జనాభా దామాషా ప్రకారం వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీ లకు 42శాతం రిజ్వేషన్లను కల్పించాలని డిమాండ్ వచ్చాయని తెలిపారు. అలాగే బీసీ ఉప కులలల్లో కొన్ని కులాల పేర్లు పలకడంతో హేళనగా ఉన్నాయని వాటిని ప్రభుత్యం దృష్టికి తీసుకెళ్లి మార్చాలని సూచనలు వచ్చాయని తెలిపారు.అలాగే ఈ అప్లికేషన్ లు నవంబర్ 13 వరకు బీసీ కమిషన్ కార్యాలయంలో స్వీకరిస్తామని,అలాగే పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చని తెలిపారు.అలాగే కొన్ని గ్రామాలలో విలేజ్ డెవలప్మెంట్ కమిషన్ లు బీసీ లపైన దౌర్జన్యాలు చేస్తున్నాయని అలాగే గ్రామ బహిష్కరణలు చేస్తున్నారని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అలా విడిసి పేర్ల పైన గ్రామాల్లో దౌర్జన్యాలు, గ్రామ బహిష్కరణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను అలాగే అధికారులను ఆదేశించారు. అలాగే బీసీ ఉపకులాలైన ఏబిసిడిఈ వర్గంలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ వచ్చాయని తెలిపారు. బిసి కులాల సర్వే నవంబర్ 6 – 7 తేదీలలో ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వేలో ప్రతి ఒక్కరు సర్వే అధికారులకు తమ ఆర్థిక స్థితిగతులపై ప్రతి ఒక్క అవగాహన కల్పించి సహకరించాలని కోరారు. గతంలో నిర్వహించిన సర్వే మాదిరి కాకుండా ఈ సర్వే నిక్కచ్చిగా నిజాయితీగా బహిరంగంగా తెలియజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ బహిరంగ విచారణలో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్ ,బాలలక్ష్మీ రంగు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్,కామారెడ్డి కలెక్టర్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments