ఆర్మూర్ మార్కేర్ కమిటీ చైర్మన్ గా సాయి బాబా గౌడ్ ను మంగళవారం నియమించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , సాయి బాబా గౌడ్ కు నియామక ప్రత్రాన్ని అందజేశారు. సాయి బాబా గౌడ్ మాట్లాడుతూ.. ఈ భాద్యతలు అప్పగించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అదేవిధంగా ఇందుకు సహకరించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డికి ,ఆర్మూర్ బాధ్యులు వినయ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
