,బోధన్ మండలంలోని సంగం గ్రామంలో ప్రమాద వశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
. పాత వర్ని గ్రామం నుంచి ట్రాక్టర్ పై కూలీ పనుల నిమిత్తం పలువురు కూలీలు భవానిపెట్ వస్తున్నారు.
సంగం గ్రామం వద్ద టిఫిన్ చేస్తానని పాత వర్నికి చెందిన చెందిన కాశీరాం (45) అనే వ్యక్తి నడుస్తున్న ట్రాక్టర్ ట్రాలికి మధ్యలో ఉన్న రాడ్డు పై నిల్చున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడ్డ కాశీరం ట్రాలీ వెనుక చక్రాల కిందకు వచ్చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
