రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
అర్శపల్లి రైల్వే గేటు దగ్గర సుమారు 40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతిని వివరాలు తెలిసిన వారు రైల్వే ఎస్ఐ 8712658581 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
