HomeLaw and Orderజిల్లాలో మరో సారి సీఐ లా బదిలీలు...

జిల్లాలో మరో సారి సీఐ లా బదిలీలు…

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో సారి సీఐల బదిలీలు చేస్తూ బుదవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ పిసిఆర్ లో ఉన్న బుక్క శ్రీనివాస్ ను నార్త్ రూరల్ సీఐ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అక్కడే ఉన్న సతీష్ కుమార్ ఐజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసిందిగా తెలిపారు.అలాగే ఐజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న పంతంగి సత్యనారాయణ ను ఆర్మూర్ టౌన్ కు బదిలి అయ్యారు.

అక్కడే ఉన్న రవి కుమార్ ను ఐజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసిందిగా తెలిపారు.అదేవిధంగా ఐజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న రెడ్డిబొయిన కృష్ణ ను రుద్రూర్ కుబదిలీ అయ్యారు. అలాగే అక్కడ ఉన్న జయేష్ రెడ్డి ను ఐజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసిందిగా తెలిపారు.

అలాగే నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐ గా విధులు నిర్వహిస్తున్న పురుషోత్తం ను రామగుండం ట్రాఫిక్ కు బదిలి అయ్యారు.ఐజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న చంద్రశేఖర్ గౌడ్ ను రామగుండం ఐటీ సెల్ ఎక్సిసిటింగ్ వెక్కెన్సీ లో బదిలీ అయ్యారు.

అదేవిధంగా ఐజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న జి.సతీష్ రామగుండం సీసీఆర్బి కి బదిలీ అయ్యారు. ఐజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న సిహెచ్.అజయ్ కుమార్ ను ములుగు డి ఎస్ బి కి బదిలి చేశారు.

అలాగే బోథ్ సీఐ గా ఉన్న బాణోత్ రమేష్ ను ములుగు సీసీఎస్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.అలాగే ఐజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న డి.రాజా రెడ్డి ను మెదక్ సీసీఎస్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్కడ మెదక్ సీసీఎస్ సీఐ గా ఉన్న సి హెచ్. పి. తిరుమలేష్ ను ఐజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసిందిగా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments