వర్ని మండల కేంద్రంలో దొంగలు బుధవారం రాత్రి బీభత్సం చేశారు . మండల కేంద్రంలో రెండు దుకాణాల్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. కిరాణా షాప్‌తో పాటు పెయింట్స్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు.
నలుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ద్వారా తెలుస్తోంది. చోరీకి గురైన దుకాణాల్లో ఏమేమి పోయాయనే బాధితులు చెప్తే గాని తెలియదని పోలీసులు తెలిపారు
