ఆడుతూ పాడుతూ తమ కళ్ల ముందు నవ్వుతూ ఉన్న చిన్నారి క్షణాళ్లో విగతజీవిగా మారింది. తమ కుమార్తె మరణంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ ఘటన భీమ్ గల్ మండలం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… మండలంలోని నందిగల్లికి చెందిన అఫీజ్, అయేషా దంపతులకు జన్మించిన మోహిజ ఆనం(2).
బుదవారం సాయంత్రం తన తల్లి బట్టలు ఉతకడానికి కిందికి వెళ్ళింది. దీనితో మొదటి అంతస్తులో ఉన్న చిన్నారి ఆడుతూ ప్రమాదవశాత్తు కాలు జారీ మెట్ల మీద నుంచి కింద పడి తీవ్ర అస్వస్థతకు గురవడంతో గమనించిన కుటుంబీకుల హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షణం క్రితం తమ కళ్ల ముందు నవ్వుతూ ఉన్న తమ కుమార్తె మరణంతో చిన్నారి తల్లిండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
