HomeTelanganaNizamabadభావోద్వేగానికి గురైన కవిత.. కన్నీళ్లు ఆగట్లేవంటూ ఆవేదన

భావోద్వేగానికి గురైన కవిత.. కన్నీళ్లు ఆగట్లేవంటూ ఆవేదన

పుట్టిన ఇంటి నుంచి మెట్టిన ఇంటికి వచ్చాను. పుట్టింటి వారు వెళ్లగొడితే.. అత్తింటి వారు అక్కున చేర్చుకున్నారు. అందుకే కన్నీళ్లు ఆగట్లేదు’’ అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను గుర్తుచేసుకుంటూ.. తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు.‘‘నేను ఏం తప్పు చేశానని తీహార్‌ జైలుకు తీసుకెళ్లి వేశారు.

ఈ జిల్లా కోడలిగా, గర్వంతో.. రోషంతో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నన్ను ఢిల్లీకి తీసుకెళ్లి తీహార్‌ జైలులో వేశారు. అయినా ధైర్యం కోల్పోలేదు. దారి తప్పలేదు.నాలుగేళ్లపాటు ఈడీ, సీబీఐ అధికారులు నన్ను సతాయించినా.. నేను తప్పు చేయలేదని చెప్పాను. నేను నిప్పులాంటి నిజామాబాద్‌ బిడ్డనని చెప్పాను’’ అని కవిత పేర్కొన్నారు. ‘నేను తప్పు చేయలేదు.

ఈ మాట నేను చెప్పడం కాదు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీబీఐ అధికారిపై విచారణ చేయాలని ఆదేశించారు. భారతదేశ చరిత్రలో సీబీఐ అధికారిపై విచారణకు ఆదేశించిన ఏకైక కేసు నాదే’’ అని కవిత అన్నారు. ‘‘మీ బిడ్డగా, పార్టీలో ఉండి పార్టీ కోసం జైలుకు వెళ్లానని పెద్ద నాయకులే చెప్పారు.

మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపాల్సి వచ్చింది? ప్రజలే ఆలోచించాలి. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే కడుపులో పెట్టుకుని చూసుకుంటామా.. కర్కశంగా బయటకు పంపిస్తామా?’’ అని కవిత ప్రశ్నించారు.

మన ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే కడుపులో పెట్టుకుని చూసుకుంటామా కర్కశంగా బయటకు పంపిస్తామా నేను చూడని పదవులా అనుభవించని రాజకీయమా తెలంగాణ రాకముందు ఏమీ లేని సమయంలో బతుకమ్మ ఎత్తుకుని మీ దగ్గరకు వస్తే వేలాదిగా వచ్చి నన్ను అక్కున చేర్చుకుని నాతో కలిసి బతుకమ్మ ఆడలేదా? నాకేం అవసరం ఎందుకు నన్ను తీసేయాలి’’ అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కవిత పలుమార్లు కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘ఇంటికి వచ్చినందుకే.. మన సొంత గడ్డకు వచ్చినందుకే కన్నీళ్లు ఆగట్లేదు అని అన్నారు. ‘‘అమ్మగారి ఇంటివారు బయటకు పంపించినా.. మా అత్త, మామ ఒక్క మాట కూడా అనలేదు.

కడుపులో పెట్టుకుని కన్నబిడ్డలా చూసుకున్నారు. ఆరు నెలలు జైలుకు పంపించినా ఒక్క మాట అనలేదు. అమ్మగారి ఇల్లు నిర్దాక్షిణ్యంగా వెళ్లగొడితే.. అత్తగారింటికి వచ్చాను. ఇప్పుడు మీ అందరి దగ్గరికి పబ్బతి పట్టి అడుగుతున్నా అని కవిత భావోద్వేగంగా చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments