నిజామాబాద్ నగరంలోని బడాబజార్ ఆర్య సమాజ్ ప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.రెండో టౌన్ ఎస్‌హెచ్‌ఓ యాదగిరిగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మృతుడిని పంజాల అజయ్‌గౌడ్ (25), తండ్రి సాయిగౌడ్‌గా గుర్తించారు.
లేబర్‌గా పనిచేసే అజయ్‌గౌడ్ కొంతకాలంగా పనికి వెళ్లకుండా తిరుగుతూ మద్యం సేవించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తరచూ రోడ్డుపైనే పడుకునేవాడని పేర్కొన్నారు. సుమారు ఆరు నెలల క్రితం యాసిడ్ తాగడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యుల సూచనలు పాటించకుండా మద్యం సేవిస్తూ తిరిగేవాడని తెలిపారు.
అజయ్‌గౌడ్‌కు కుటుంబ కలహాలు ఏమీ లేవని అతని అన్న కృష్ణగౌడ్ పోలీసులకు తెలిపాడు. రోజూ మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడ నిద్రించేవాడని పేర్కొన్నాడు. కాగా, అజయ్‌గౌడ్ పురుగుల మందు సేవించినట్లు అతని అన్న కృష్ణగౌడ్‌కు పోలీసులు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రెండో టౌన్ ఎస్‌హెచ్‌ఓ యాదగిరిగౌడ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
