HomeCRIMEవడ్డి రాయుళ్ల వెన్ను విరిచే దెప్పుడో ......యథేచ్ఛగా సాగుతున్న జీరో దందా ........ఆగని.దాష్టికాలు ....వేధింపులు...

వడ్డి రాయుళ్ల వెన్ను విరిచే దెప్పుడో ……యథేచ్ఛగా సాగుతున్న జీరో దందా ……..ఆగని.దాష్టికాలు ….వేధింపులు తాళలేక .అవమానాలు భరించాలేక …అసువులు బాస్తున్న బాధితులు ……..ఉత్తీతి దాడులతో సరిపెట్టిన పోలీసులు

మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరా గా చేసుకొని వడ్డి వ్యాపారుల సాగిస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అసలు కన్న వడ్డీలు ఆపై చక్రవడ్డీల పేరుతొ దాష్టికాలు సాగిస్తున్న వడ్డి రాయుళ్ల వెన్ను విరిచే నాధుడే లేకుండా పోయారు.

గతంలో ఐజి రంగనాథ్ వడ్డి వ్యాపారుల మీద విరుచుక పడ్డారు దందా ను కట్టడి చేయడానికి స్పెషల్ డ్రైవ్ లు చేయించారు.

ఏక కాలం లో దాడులు చేసి వడ్డి వ్యాపారుల చిట్టా మొత్తం చేతులో పెట్టుకున్నారు. ఓ దశలో వడ్డి రాయుళ్ల వెన్నులో వణుకు పుట్టించారు. కానీ ఆయన బదిలీ తో దాడుల తర్వాతి కార్యాచరణ ను పోలీసులు అటకెక్కించారు.

మళ్ళీ వడ్డి వ్యాపారుల ఆగడాల షరా మాములు అయ్యాయి. నిజామాబాద్ నగరానికి చెందిన వడ్డి వ్యాపారుల ఆగడాలకు మరో కుటుంబం బలి అయింది. వడ్డి వ్యాపారుల వేధింపులు తాళలేక వారి మాటలకు మనస్థాపం గురైన ఓ కుటుంబం బుధవారం బాసర గోదావరి నది లోకి దూకి ఆత్మ హత్యకు సిద్ధం అయింది.

తండ్రి కూతరు గల్లంతు కాగ తల్లి మాత్రం జాలర్లు కాపాడి ఒడ్డుకు చేర్చారు. నిజామాబాద్ నగరంలోని న్యాల్ కాల్ రోడ్డు లో నివాసం ఉండే వేణు అనురాధ లు వడ్డి వ్యాపారులైన రోషన్ వికాస్ ల వద్ద ముడులక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు.

వడ్డి తో సహా అసలు చెల్లించినప్పటికి చక్ర వడ్డి కూడా ఇవ్వాలని వేధించారని ఇంటికి తమ మనుషులను పంపి తన కూతరు పూర్ణ తో పాటు తన పట్ల అనుచితంగా మాట్లాడారని బాధితురాలు అనురాధ వాపోయింది.వివస్ర్తాలను చేసి ఉరేగిస్తామని బెదిరించారనిఆమె పోలీసుల విచారణలో చెప్పింది.

వారిని ఎలాగో ఎదిరించలేమని డబ్బులు సైతం చెల్లించలేని నిస్సహాయ స్థితి లోనే తామంతా ఆత్మ హత్య చేసుకోవాలని బాసర గోదావరి నది కి వచ్చామని అనురాధ పేర్కొంది.

ఫైనాన్స్ వ్యాపారి తమ పార్టీకి చెందిన రోషన్ బొర్రా ను బీజేపీ సస్పెండ్ చేసింది. రెండు నెలల కాలంలోనే నగరంలో ఈ తరహా ఉదంతాలు మూడు వెలుగులో కి వచ్చాయి. నగరంలో కోట్లాది రూపాయల తో వడ్డి వ్యాపారం చేసే వారు నగరంలో 20నుంచి ముప్పై మంది పైగానే ఉన్నారు.

అర్ద రాత్రి వెళ్ళిన సరే కోటి రూపాయలు వడ్డి గా ఇచ్చే వారు నగరంలో డజన్ మంది సెట్ లు ఉన్నారు. అందరూ జీరో దందా గా చేస్తారు. బడా వ్యాపారుల నుంచి ఉద్యోగుల నుంచి 1 లేదా 2 వడ్డి కి తీసుకోని అయిదు నుంచి ఆరు రూపాయలకు వడ్డి లకు ఇచ్చే గ్రూప్ నగరంలో అనేకం ఉన్నాయి.

శ్రద్ద నంద్ గంజ్ లో పది మంది తో ఉండే ఓ గ్రూప్ కోటి నుంచి రెండు కోట్ల దాక వడ్డీలకు ఇస్తుంది. ఈ గ్రూప్ లో ఆయా పార్టీలకు చెందిన చోటామోటా లీడర్లు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments