చెట్టు కు చిక్కుక పోయిన గాలి పటం ను తీయబోయిన ఓ బాలుడు కరెంట్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఎడపల్లిమండలం కుర్నాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుర్నాపల్లి గ్రామానికి చెందిన మతిన్(13) అదే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలో ఆరో తరగతి చదువుతున్నారు. ఆరోగ్యం బాగాలేక స్కూల్ కు వెళ్ళ లేదు సోమవారం ఇంటి వద్ద గాలిపటం ఎగురవేశాడు.
ఇంటి సమీపంలో చెట్టుకు గాలి పటం చిక్కుకుపోవడంతో దాన్ని తీసేందుకు చెట్టుఎక్కాడు. అయినా అందక పోవడంతో ఇనుప రాడ్డు సహాయంతో కరెంట్ తీగల్లో చిక్కకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించాడు అంతే కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.అప్పటిదాకా కళ్ళముందే ఆడుకుంటూ గాలి పటం ఆట తో విగత జీవిగా మారడం తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
