HomeHEALTHప్రభుత్వ ఆసుపత్రి లో మెడిసిన్ టెండర్ దరఖాస్తుల ఆహ్వానం....

ప్రభుత్వ ఆసుపత్రి లో మెడిసిన్ టెండర్ దరఖాస్తుల ఆహ్వానం….

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడిసిన్ సరఫరా కోసం ప్రభుత్యం టెండర్ ను విడుదల చేసింది. టెండర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.

నిజామాబాద్ చైర్మన్ – జిల్లా కొనుగోలు కమిటీ ఆదేశాలమేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 సంవత్సరాల కాల పరిమితికి డ్రగ్స్,మెడిసిన్, మెటీరియల్,సామాగ్రి(శాస్త్ర చికిత్స వస్తువులు),రి ఎజెంట్స్, అర్థో ఇంప్లాంట్లు,సరఫరా కోసం అర్హత కాగిన తయారీదారీ/అధీకృత డీలర్లు/నమోదిత సంస్థలు నుంచి టెండర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు రుసుము రూ. 5000 డిడి ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 19 నుంచి 27 వ తేది లోపు సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను అందజేయాలని సూచించారు.

దరఖాస్తుదారులు మరింత సమాచారం కొరకు ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments