HomeTelanganaNizamabadవికలాంగుల పెన్షన్ రూ.6000 రూపాయలకు పెంచాలి…విహెచ్ పీఎస్ ఆధ్వర్యంలో మొదలైన రిలే నిరాహారదీక్షలు.

వికలాంగుల పెన్షన్ రూ.6000 రూపాయలకు పెంచాలి…విహెచ్ పీఎస్ ఆధ్వర్యంలో మొదలైన రిలే నిరాహారదీక్షలు.

ఈనెల 26 నాడు చలో హైదరాబాద్.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్లు రూ. 6000 రూపాయలకు పెంచాలని విహెచ్ పీఎస్ ఆద్వర్యంలో నిరసన చేపట్టారు.

సోమవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద విహెచ్ పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్రంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయని విహెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షులు బీరప్ప తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

నేటి నుంచి ఈ రిలే నిరాహార దీక్షలు ఈ నెల 23 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనే స్వయంగా ఎన్నికల సమయంలో అన్ని సామాజిక పెన్షన్లు 2000 నుంచి 4000, వికలాంగుల పెన్షన్లు 4000 నుంచి 6000 పెంచుతామని మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచి పోయిన కానీ ఇప్పటి వరకు అమలు చెయ్యకుండా కనీసం మానవత్వం లేని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని ఎద్దేవ చేశారు. ఇప్పటికే రెండు సార్లు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కలెక్టరేట్ల ముట్టడి చేశామని అయిన కూడా ప్రభుత్వం ఇంకా నిమ్మకు నిరత్తనట్లు వ్యవహరించడం తగదు అని హెచ్చరించడం జరిగింది. ఈ రిలే నిరాహారదీక్షల సమయంలో పెన్షన్ల పెంపు ప్రకటన రాకపోతే ఈ నెల 26 నాడు పెన్షన్ దారుల ఆవేదన సభ హైదరాబాద్ కేంద్రంగా మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో జరిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా కోర్టులో నిలబెడుతామని హెచ్చరించారు. ఈ దీక్షలను MRPS జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, MSP నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సారికెళ్ల పొషెట్టి మాదిగ, ఈ దీక్షకు MRPS, MSP, MMS, MEF సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్ పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, విహెచ్ పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సలీం, విహెచ్ పీఎస్ మహిళా విభాగం చిట్టి కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments