ప్రమాదవశాత్తు నడుస్తున్నరైలు నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ తావునాయక్ తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని అర్సపల్లి, నిజాం కాలనీకి చెందిన షేక్ రసూల్(62). మంగళవారం ఉదయం నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు గా వెళ్తున్న గుర్తు తెలియని రైలు నుంచి బర్దిపూర్ శివారులో కింద పడి మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబం సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తావునాయక్ పేర్కొన్నారు.
