తెలంగాణ లోనే కల్తీ కల్లు పెట్టింది పేరున్నట్లుగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో మరోసారి టాస్క్ ఫోర్స్ పంజా విసిరింది. ఆబ్కారీ అధికారులు మమ్ముళ్ల మత్తు జోగుతున్న నేపథ్యంలోప్రాణాంతకమైన అల్పో జోలం అక్రమ రవాణా మరోసారి తెరమీదికి వచ్చింది. ఏకంగా టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో ముస్తేదారుల్లో వణుకు మొదలయ్యింది. కానీ అధికార పార్టీలో ఓ కీలక నేత అండ తో మత్తు మాఫియా మళ్ళీ ఈ చీకటి దందా కు తెరలేపిందని ప్రచారం జరుగుతుంది.దశాబ్దాల తరబడి కల్తీ కల్లు దందా లో మాఫియాలుగా చెలామణి అవుతున్న ముస్తేదారులే కల్లు కల్తీ కోసం అల్పోజోలం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతాల నుంచే జిల్లాకు తరలిస్తారు
బాన్సువాడ వర్ని రహదారిలో బుధవారం ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 40 లక్షల రూపాయల విలువచేసే నాలుగున్నర కిలోల ఆల్ఫాజూలంను స్వాధీనపరుచుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆల్ఫా జోలం ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతుందన్నది తేలాల్సి ఉంది.నాందేడ్ నుంచి బోధన్ మీదుగా జిల్లాకు తెచ్చి ఇక్కడి నుంచి సిరిసిల్ల దాక ఈ మాఫియా విస్తరించిందని చెప్తున్నారు. ఇదివరకు కల్లు కల్తీ కోసం క్లోరల్ హైడ్రేడ్ ను కలిపేది కానీ ఆబ్కారీ శాఖఉక్కుపాదం మోపింది. సి హెచ్ చెలామణి తగ్గడంతో మరోసారి ఎక్కువధర ఉండే అల్పోజోలంతో కల్తీ చేయడానికి కల్లు ముస్తేదారులు సిద్ధం అవుతున్నారు కల్తీ కల్లు దందా సాగించే వారెవ్వరూ అల్పోజోలం దందా చెయ్యరు కానీ కానీ చేసేవారికి కాసులు ఎర వేస్తారు. అందుకే గుజరాత్ మహారాష్ట్ర ల నుంచి గుట్టుగా ఈ మత్తు పదార్థం తరలిస్తున్నారు.
మత్తులో అబ్కారీ అధికారులు ……మత్తురవాణా కు రాచ బాట గా మారిన ఇందూరు ……మళ్ళీ తెరమీదికి ఆల్ఫా జోలం …… స్టేట్ టాస్క్ ఫోర్స్ దాడులతో మూస్తే దార్ల లో వణుకు
RELATED ARTICLES
