HomeTelanganaNizamabadబాపూజీ వచనాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం అధ్యక్షులు గడ్డం...

బాపూజీ వచనాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం (ఢిల్లీ )

ఈ రోజు నిజామాబాదు నగరం లోని రాష్ట్రపతి రోడ్ లో బాపూజీ వచనలయ కార్యాలయం లో నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కమిటీ సభ్యుల తో ఎన్నికల అధికారి MS ఆచార్య ప్రసంసా పత్రాన్ని అందచేసి ప్రమాణ స్వీకారం చేయించారు

ఈ సందర్బంగా బాపూజీ వచనలయ అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన బాపూజీ వచనాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అన్నారు పేద బీద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు వేదికగా నిలబడి వారిని ఉత్తమ విద్యార్థులుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దుతుంది అన్నారు బాపూజీ వచనాలయంలో అన్ని ఎగ్జామ్ లకు ప్రిపేర్ అయ్యే బుక్కులను అందుబాటులో ఉంచామని అన్నారు నగరంలోని బాపూజీ వచనాలయాలకు అన్ని వర్గాల ప్రజలు మరియు అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు సహకరించి అభివృద్ధికి తోడ్పాడలని కోరారు

ఈ వేదిక నిజాంబాద్ విద్యార్థులకు అండగా నిలబడుతుందన్నారు కలసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకుందాం అన్నారు లైబ్రరీని తెలంగాణలో ఎక్కడ లేని విదంగా సరికొత్త ఆలోచన తో డిజిటల్ లైబ్రరీని నిజామాబాదు విద్యార్థుల కోసం తీసుకొస్తున్నాం అన్నారు

ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఎమ్మెస్ ఆచార్య మాట్లాడుతూ శాంతియుత వాతావరణం లో ఎన్నికలు జరగడం ఆనందంగా ఉందన్నారు గెలిచిన అభ్యర్థులు అభివృద్ధి వైపు లేసి తెలంగాణలో మొదటి లైబ్రరీగా ఉంచాలని అన్నారు గెలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు

ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు పులి జైపాల్,నారాయణ, కార్యదర్శిగా మీసాల సుధాకర్ రావు, కోశాధికారిగా బి గంగాధర్ రావు, ఉపాధ్యక్షులుగా భవంతి దేవిదాస్, బోగా అశోక్, సంయుక్త కార్యదర్శిగా AS సాంబయ్య, దత్తాత్రి,

కార్యవర్గ సభ్యులుగా లక్కం రెడ్డి, కొవ్వూరి జగన్, ఆమందు విజయ్, పుల్గమ్ హనుమండ్లు, అరేట్టి లక్ష్మి నారాయణ,కసుబ సంపత్,గందరి మహిపాల్ రెడ్డి,పాటి అనిల్ రెడ్డి,రుద్ర ప్రతాప్, గాదె మోహన్ రావు,మహ్మద్ కాయ్యుమ్, గోవింద్ ప్రసాద్ జ్వవార్, ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం లో స్టాప్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments