HomeTelanganaNizamabadబీజేపీ లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎడతెగని కసరత్తులు .....ముగ్గురు సభ్యులతో కమిటీ

బీజేపీ లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎడతెగని కసరత్తులు …..ముగ్గురు సభ్యులతో కమిటీ

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పటిష్టమైన కార్యచరణ కు సిద్ధం అవుతున్న బీజేపీ శాసన మండలి ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించే పట్టు దలతో ఉంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న నిజామాబాద్ పట్టభద్ర నియోజకవర్గం లో కాషాయ జెండా ఎగరేయాలని కమలనాధులు ఉవ్విళ్ళు ఊరుతున్నారు.

ప్రస్తుతం జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తిఅయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలో బరిలోకి దించే ఆలోచనలో ఉంది. అందుకే ఈ నియోజకవర్గం ను కైవసం చేసుకునే ఎత్తుగడ కు బీజేపీ వ్యూహరచన చేస్తుంది.

పక్క ప్రణాళిక తో కదిలితే గెలుపు నల్లేరు మీద నడకే ననే భావన బీజేపీ పెద్దల్లో ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం పరిధి నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉంది. కరీం నగర్ ,నిజామాబాద్ ,ఆదిలాబాద్ ,మెదక్ .లున్నాయి. నాలుగు జిల్లాలోనూ బీజేపీ కి చెందిన ఎంపీ లే ఉన్నారు.

ఆదిలాబాద్ మినహా మిగితా ముగ్గురు ఎంపీ లు బీజేపీ దిగ్గజ నేతలుగా ఖ్యాతి పొందిన వారే. అంతే కాదు ఎమ్మెల్యే లందరు ఆదిలాబాద్ నిజమాబాద్ జిల్లాకు చెందినవారే కదా సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిగా పనిచేస్తే సులువుగా గెలవచ్చనేది పార్టీ పెద్దల అంచనా.

అయితే అభ్యర్థి విషయంలోనే ఈసారి ఎలాంటి లోపం లేకుండా ఉండాలనే ఆలోచనతోనే. ఎన్నికల పక్రియ సంగతి ఎలా ఉన్న అభ్యర్థి ఎంపికే అత్యంత క్లిష్టంగా భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలు నాలుగే అయినా ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. దాదాపు ఒక్కో ఉమ్మడి జిల్లా నుంచి కనీసం ఇద్దరు ముఖ్య నేతలు ఎమ్మెల్సీ టికెట్ రేసు లోకి వచ్చే అవకాశం ఉంది.

అందుకే సీనియారిటీ ఒక్కటే కాకుండా ఆర్థిక సామాజిక అంశాలను సైతం ప్రామాణికంగా అభ్యర్థి ఉండాలనేది బీజేపీ పెద్దల వ్యూహం. ఇందులో భాగంగా ముగ్గురు సీనియర్ నేతల తో ఓ కమిటీ ని వేసింది. అభ్యర్థి ఎవరనేది ప్రతిపాదించే కార్యం కమిటీ మీదే వేసింది. సో ఈపాటికే రంగంలోకి దిగిన కమిటీ ఎంపీ ఎమ్మెల్యే లు జిల్లా అధ్యక్షులు పార్టీ కేంద్ర రాష్ట్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుంది.

ముఖ్యంగా ఎంపీ సూచించిన అభ్యర్థుల విషయంలోనే ఈ కమిటీ ఎక్కువగా ఫోకస్ చేసింది. అయితే ఆర్థికంగా ఏ మేరకు బలంగా ఉన్నారనేది కమిటీ వాకబు చేస్తుంది అందుకే తమకు టికెట్ కావాలని అడిగిన నేతలకు ఏ మేరకు ఖర్చు చేస్తారని కమిటీ అడుగుతుంది.

అందుకే ఒకరిద్దరు నేతలు వామ్మో మాకు టికెట్ వద్దని అక్కడే చెప్పేసారు. మొత్తంగా నలుగురు పేర్లు తెరమీదికి వచ్చాయని ఎక్కువగా ఈ నలుగురు పేర్లే ప్రతిపాదన గా వచ్చాయని బీజేపీ నేతలు చెప్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments