ఆర్మూర్ మండలం మామిడి పల్లి జాతీయ రహదారి సమీపంలో గురువారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది.
ఆర్మూర్ కు చెందిన లలితా స్కూటీ వాహనం మీద మామిడి పల్లి నుంచి ఆర్మూర్ వైపు వస్తుండగా బైకు మీద వచ్చిన ఇద్దరు దుండగులు స్కూటీ మీద వెళ్తున్న లలితా మెడల లో నుంచి మూడున్నర తులాల గొలుసు ఎత్తుకొని పారిపోయారు.
ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
