రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి చెందిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..
సిబిఐటీ లో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న శివాని,కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది.
తిరిగి హాస్టల్ కు వెళ్లేందుకు తన స్నేహితుడు వెంకట్ రెడ్డి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా నర్సింగి సర్వీస్ రోడ్డు వద్ద కారు ఢీ కొనడంతో శివాని మృతి చెందినట్లు తెలిపారు.ప్రస్తుతం వెంకట్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
