ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూర్ మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే… మాక్లూర్ మండలం మాణిక్ బండారు గ్రామానికి చెందిన నీలం రాజు (25)కు పద కొండు నెలల కింద వివాహమైంది. ఐతే నెల రోజుల క్రితం కొడుకు పుట్టాడు.
మంగళవారం ఉదయం మండలంలోని దాస్ నగర్ గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
