భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
ముబారక్ నగర్ శివారులోని 106 సర్వే నంబరులో రూ. 20లక్షల వ్యయంతో నిర్మించిన ఒలంపిక్ భవన పునాదులను, పిల్లర్లను కొందరు భూకబ్జాదారులు ధ్వంసం చేస్తూ, సంబంధిత భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తూ, భూకబ్జాదారులపై పిర్యాదు చేయూ విషయమై… తమరితో మనవి చేయునది ఏమనగా జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 2009 – 10 సంవత్సరంలో ఖలీల్ వాడి గ్రౌండ్ తీసుకొని అక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం చేశారు.
ఒలంపిక్ అసోసియేషన్ మరియు క్రీడాకారుల వినతులు, పోరాటం మేరకు నిజామాబాద్ మండలం ముబారక్ నగర్ శివారులోగల 106 సర్వే నంబరులో జిల్లా క్రీడా మైదానం నిర్మిస్తామని హామీ ఇచ్చి, అక్కడ మైదానం కోసం 7.35 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
అలాగే ఒలంపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం 800గజాల స్థలాన్ని కేటాయించారు. ఒలంపిక్ భవన నిర్మాణానికి కేటాయించిన 800గజాల స్థలాన్ని చదును చేసి సుమారు రూ.20లక్షల వ్యయంతో మేము పునాదులు, పిల్లర్లు అప్పట్లోనే నిర్మించడం జరిగింది.
అయితే కొందరు భూకబ్జాదారులు అప్పట్లో ఈ నిర్మాణాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. మేము అడ్డుకొని వారిపై కేసు నమోదు చేయించడం జరిగింది. మళ్ళీ ఈ నెల 21న (21-12-
2024)కొందరు
భూకబ్జాదారులు మా ఒలంపిక్ అసోసియేషన్ భవనానికి చెందిన పునాదులు, పిల్లర్లు
కూల్చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.
వెళ్లి చూడగా మా భవన నిర్మాణ పిల్లర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు నిర్ధారణ అయింది. కావున ఈ కబ్జా విషయమై సమగ్ర విచారణ చేసి, భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని తమరితో విన్నావిస్తున్నాము. జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి చెందిన ప్రభుత్వ క్రీడా స్థలాన్ని కాపాడాలని కోరుతున్నాము.
తమరి దయతో ఇప్పటికే జిల్లా క్రీడా మైదానం చుట్టూ కంచె వేసుకున్నామని గుర్తు చేస్తూ, తమరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ఒలంపిక్ భవన నిర్మాణానికి కేటాయించిన 800 గజాల స్థలాన్ని సైతం భూకబ్జాదారుల నుంచి కాపాడి, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.డి సి పి ని కలిసిన వారిలో ఒలింపిక్ జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఉపాధ్యక్షులు గాధరి సంజీవ్ రెడ్డి కలిసారు.
