కామారెడ్డి జిల్లా బిక్నూర్ ఎస్సై తో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ యువకుడు ఓకె సారి మిస్సింగ్ కావడం పోలీసు శాఖ ను కుదిపేసింది.వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద మహిళా కానిస్టేబుల్ వి భావిస్తున్న వస్తువులను గుర్తించారు దీనితో అనుమానంతోచెరువు చుట్టుపక్కల గాలించారు .చివరికి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద మహిళా కానిస్టేబుల్ తో పాటు మరియు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి ..
ఎస్సై ఫోన్ నిన్న సాయంకాలం నుంచి స్విచ్ ఆఫ్ ఉంది.. ఆయన ఆచూకీ కోసం ఇంకా గాలింపు లు సాగుతున్నాయి. బిక్కనూర్ ఎస్సై సాయి కుమార్ తో పాటు బీబీపేట్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ లు ఓకె సమయంలో మిస్సింగ్ కావడం వెనుక మిస్టరీ ని చేధించే పనిలో పోలీసులున్నారు.శృతి నిఖిల్ ల మృతదేహాలు లభ్యం కాగా ఎస్సై ఆచూకీ కోసం గాలిస్తుంటే కాసేపటికి క్రితమే దొరికింది
