ఎస్సీ గురుకుల కళాశాల లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. .. ముదిగొండ గ్రామానికి చెందిన సాయివర్ధన్ కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాల లో ఇంటర్ చదువుతున్నాడు.
ఈ క్రమంలోనే సోమవారం ఇంటికి వెళ్లి వచ్చిన సాయివర్ధన్ కళాశాలలో రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కళాశాల సిబ్బంది సాయివర్ధన్‌ను ఆసుపత్రికి తరలించగా.. అతడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు
