HomeCRIMEఇనాం భూముల్లో రియల్ ఎస్టేట్ గద్దలు..జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా భూదందాలు ……

ఇనాం భూముల్లో రియల్ ఎస్టేట్ గద్దలు..జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా భూదందాలు ……

.

విలువైన భూములు అన్యాక్రాంతం అవ్వకుండా ప్రభుత్వం అనేక చట్టాలను అమల్లోకి ఉన్నాసరే భూమాఫియా ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది.

నిషేదిత భూములను చెరబట్టి అమాయకులకు అంటగడుతున్నారు. అధికారులతో లోపాయికారి చేతులు కలిపి కోట్లాది రూపాయల విలువైన భూములను మాయం చేస్తున్నారు మారుమూల ప్రాంతాలలో సంగతి ఎలా ఉన్న ముఖ్య అధికారులందురు ఉండే జిల్లా కేంద్రంలోనే విలువైన భూములను ప్లాట్ లుగా చేసి సొమ్ము చేసుకుంటున్నారు.ఇనాం భూములను అమ్మడం నిషేధం.

అలాంటి ఇనాం భూముల్లోనూ రియల్ ఎస్టేట్ గద్దలు వాలాయి. బడా నేతల నీడలో ఉండే ఒకరిద్ద నేతలు విలువైన ఇనాం భూములను మాయం చేసారు. నగరంలోని చందా నగర్ లో ని ఇనాంభూములను సైతం ప్లాట్ గా చేసి పేద మధ్య తరగతి ప్రజలకు అమ్మేసారు.

అసెంబ్లీ సాక్షిగా నూతన భూ చట్టాలను ప్రవేశపెట్టారు అందులో భాగంగా ఇనాం భూముల రివిజన్ ఒక అంశం ఈ అంశములోనే ఇప్పుడు నిజామాబాద్ చంద్ర నగర్ కాలనీ వాసులకు దడ పుట్టిస్తుంది
పేద మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు ఉండాలనే ఆశతో ముందుగా అందుకు అవసరమైన స్థలం కొనుగోలు చేస్తారు.

పైసా పైసా కూడబెట్టి ఇంటి స్థలం కొనుగోలు చేస్తే తీరా ఆ స్థలం నిషేదిత జాబితా వుందని తెలిసాక గుండెలు బాదుకుంటున్నారు.

సంబంధిత రియల్టర్ ల మీద చర్యలు తీసుకోవాలని అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగక తప్పడం లేదు..
రెవెన్యూ రికార్డు ప్రకారం ఈ సర్వే నంబర్లు ( 733.734.735.736.737.739. ల్లో దాదాపు 10 ఎకరాలు భూములు ఇనాంజాబితా లోఉన్నాయి.

నిజానికి ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీలు లేదు అసలు ఈ సర్వే నెంబర్ ల్లో భూములను ఇతరుల మీద బదలాయించడం చెల్లదు.

అలాగే ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం కుదరదు
అయినప్పటికీ వందల మందికి యదేచ్చగా రిజిస్ట్రేషన్ లు జరిగాయి . అలాగే వాటి ధ్రువపత్రాల ను ఆధారంగా చేసుకొని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుంచి నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి.

అందుకే సామాన్య ప్రజలకు ఇప్పటివరకు సందేహం కలగట్లేదు. అలాగే దర్జాగా ఇండ్లు కట్టేసారు. ఇనాం భూములు ఇంత సులువుగా ఎలా బదలాయింపు జరిగింది ఎవ్వరికి అంతు చిక్కడం లేదు.

స్థానికంగా పేరుమోసిన కొందరు రియల్టర్లు ఓ ముఠా గా ఏర్పడి ఈ భూముల ప్లాట్ లు గా చేసి అమ్ముకున్నారు కోట్లకు పడగలెత్తారు.

ముఖ్యంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులతో ములాకత్ అయి ఈ నిషేదిత భూములను గుట్టుగా మాయం చేశారు.

భూములబదలాయింపు …..ప్లాట్ ల విక్రయాలు……ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నపుడు ఆవైపు కన్నెత్తి కూడా చూడని యంత్రాంగం అక్రమ నిర్మాణాలు అంటూ జేసీపీ లతో వచ్చి విరుచుక పడి కూల్చేయడం అధికారులకు ఆనవాయితీ గా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments