ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడి మహిళ మృతి చెందిన ఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే..నగరంలోని బోర్గం (పి) కి చెందిన నిహారిక(32).సోమవారం సాయంత్రం బట్టలు అరబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ భవనం పై నుంచి కింద పడి మృతి చెందినట్లు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
