HomePOLITICAL NEWSArmoorనియోజకవర్గ అభివృద్ధికై నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం

నియోజకవర్గ అభివృద్ధికై నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం

తెలంగాణ రాష్ట్ర పంచాయత్ రాజ్,గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ-శిశు శాంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క ) హైదరాబాద్ మంత్రి ఛాంబర్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికై నిధులు మంజూరు చేయాలని మంగళవారం వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. నియోజకవర్గంలో పలు కొత్త రోడ్లను, మరియు BT రెన్యువల్ కి నిధులు కావాలని. మండలం లోని మంథని నుండి రాంపూర్ వరకు 4.7 కిలోమీటర్ల రోడ్డు ను 4.40 లక్షల (నాలుగు కోట్ల నలబై లక్షలు) తో,ఇవే కాకా ఆర్మూర్ నియోజకవర్గ నికి సంబంధించిన ఆయా గ్రామలకి సంబంధించిన 21బిటి రోడ్లను 1987 లక్షల( సుమారు పందొమ్మిది కోట్ల ఎనబై ఏడూ లక్షల )లతో రినివాల్స్ చేయాలని మాక్లూర్ మండల మెట్టు గొట్టిముకల నుండి ఆంధ్రనాగర్,లక్నపూర్,ఇంద్రనగర్ వరకు 3.85 కిలోమీటర్ రోడ్డును 203 లక్షల (రెండు కోట్ల మూడు లక్షల) నిధులు.

నందిపేట్ రోడు నుండి ఎల్లమ్మ దేవాలయం వరకు 200 కిలోమీటర్ లకు 200 లక్షలు( రెండు కోట్ల )రూపాయలు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.

ఆయా శాఖల అధికారులతో చర్చించి వెంటనే నిధులు మంజూరు చేస్తానని పూర్తి హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రికి ఆర్మూరు నియోజకవర్గ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments