సాయం చేస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాధిత ఓ మహిళ ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
భర్తతో గొడవ పడి నిర్మల్‌కు వెళ్లిన మహిళను పరిచయస్తుడైన గౌతమ్ ఈ నెల 17న నిజామాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. అనంతరం ఆమెకు మాయ మాటలు చెప్పి ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు
