నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉండే హరిత హోటల్ కు ఆక్రమణ మారక అంటుకుంది. టూరిజం అధికారులకాసుల కక్కర్తి కోసం మెయిన్ గేట్ మూసేసి అదే స్థలం లో భారీ తాత్కాలిక నిర్మాణం కు అనుమతి ఇచ్చారు. స్థానికంగా ఉండే ఓ వ్యాపారి తో డీల్ మాట్లాడుకొని భారీ టేలా ఏర్పాటు సై అనేసారు. అంటే హోటల్ లో రావడానికి బయటికి వెళ్లడానికి ఇప్పుడు ఓకె ఎంట్రీ వుంటుంది. భారీ టేలా ను మెయిన్ గేట్ లో మూడురోజులుగా అమర్చుతున్నారు. అయినా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వుండడం ఫై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ టేలా ఏర్పాటు వెనుక ఓ టూరిజం అధికారి తెరవెనుక చక్రం తిప్పుతున్నారు.పర్యాటకులను ఆకర్షించడానికి అరంగం ను మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఈ మద్యే కొత్త టూరిజం పాలసీ ఖరారు చేసింది. కానీ జిల్లాస్థాయిలో టూరిజం అధికారులు మాత్రం కాసుల కక్కర్తి లో పడి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. పర్యాటకుల సౌకర్యం కోసం ఆయా ప్రాంతాల్లో సకల సదుపాయాల హై క్లాస్ హోటళ్ల ను అందుబాటులోకి తెచ్చింది.సమీప ప్రాంతాల్లో పర్యటించే సందర్శకులు విడిది చేయడానికే ఈ హోటళ్ల కోట్లాది రూపాయల వ్యవయం తో నిర్మించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నగర నడిబొడ్డున రైల్వే స్టేషన్ బస్టాండ్ లకు కూత వంద మీటర్ల దూరంలో హరిత హోటల్ ను నిర్మించారు. కానీ మొదట్లో నిర్వహణ బాగానే ఉన్నా గత కొంత కాలంగా అధికారుల కాసుల కక్కుర్తి కోసం ఈ హోటళ్ల ను ఫణంగా పెట్టారు. నిర్వహణ ఎలాగో గాలికి వదిలేసిన అధికారులు హోటల్ బ్యూటీ ని వ్యూహాత్మకంగా దెబ్బతిస్తున్నారు.అధికారికంగా అనేక నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. దీనితో హోటల్ ఎంట్రీ నే వెనుక భాగంలోకి మార్చేశారు ఇవేవి చాలవన్నట్లుగా స్థానిక అధికారులు హోటల్ అడ్డా ను ఆసరాగా చేసుకొని తమకు తోచినమేరకు వసూళ్ళ దందా కు తెగబడ్డారు. పక్కనే ఉన్న చెన్నై మాల్ నుంచి లోపాయికారి నెలకు రూ 30 వేలు మెక్కేసి ఆ షాప్ సిబ్బంది వాహనాలు పార్కింగ్ చేయడానికి అనుమతులు ఇచ్చారు. ఆతర్వాత హోటల్ సెక్యూరిటీ సిబ్బంది కోసం నిర్మించిన గది ని పూల వ్యాపారికి లోపాయికారి అద్దె కు ఇచ్చారు ఈ వ్యవహారాలను ఇది సంగతి రట్టు చేయడంతో తెలు కుట్టిన దొంగల్లా సైలెంట్ గా వెనక్కి తగ్గారు. ఎలాగో అక్రమ సంపాదన కు హోటల్ కామధేనువుగా చేసుకున్న అధికారులు మరో ఎత్తుగడ కు తెరలేపారు ఓ వ్యాపారిని రంగంలోకి దించి హైదారాబాద్ లో ఉండే కీలక అధికారి వద్దకు పంపి నయోనో భయానో ముట్టజెప్పి ఈ భారీ టేలా వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చక్రం తిప్పారు. కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన హోటల్ కు ఎంట్రీ ఎగ్జిట్ ల కోసం రెండు గేటు లను ఏర్పాటు చేస్తే ఇప్పుడు టేలా కోసం ఎగ్జిట్ గేట్ ను మూసేసారు అందమైన భవనం కు దిష్టి బొమ్మల ఓ భారీ టేలా ను అదికూడా మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసారు.
