భార్యను భర్త కత్తితో పొడిచిన ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..రూరల్ మండలం పరిధిలోని మల్లాపూర్ లోఆదివారం రాత్రి ఘటన జరిగింది.. మల్లాపూర్ కు చెందిన మౌనిక మోపాల్ మండలం తడెం గ్రామానికి చెందిన గణేష్ తో వివాహమైంది.మౌనిక గణేష్తో కలిసి ఆదివారం తన పుట్టింటికి వెళ్లారు.
అక్కడ మల్లాపూర్ లో కుటుంబ సభ్యులతో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు గణేష్ పక్కనే ఉన్న కత్తి తో మౌనిక ను పొడిచ్చినట్లు తెలిపారు.అక్కడే ఉన్న కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ప్రగతి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు.
