HomeCRIMEనాందేడ్ కేంద్రంగా నకిలీ నోట్ల దందా..!గుట్టురట్టు చేసిన వర్ని పోలీసులు.

నాందేడ్ కేంద్రంగా నకిలీ నోట్ల దందా..!గుట్టురట్టు చేసిన వర్ని పోలీసులు.

అమాయక రైతులను అడ్డం పెట్టుకుని, బ్యాంకింగ్ వ్యవస్థనే బురిడీ కొట్టించాలని చూసిన నకిలీ నోట్ల ముఠా ఆగడాలకు వర్ని పోలీసులు చెక్ పెట్టారు. మహారాష్ట్రలోని నాందేడ్ కేంద్రంగా సాగుతున్న ఈ భారీ నెట్‌వర్క్‌ను ఛేదించి, లక్షలాది రూపాయల నకిలీ కరెన్సీతో పాటు నిందితులను కటకటాల్లోకి నెట్టారు.

ఈ ఉదంతం వర్నిలోని కెనరా బ్యాంక్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే వ్యక్తి తన పంట రుణం చెల్లించేందుకు రూ. 2,08,500 నగదును బ్యాంకులో జమ చేసేందుకు వచ్చాడనీ అన్నారు.

అయితే, నగదును పరిశీలించిన బ్యాంకు మేనేజర్ పంకజ్ కుమార్, అవి నకిలీ నోట్లని గుర్తించి అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి:

జడ్చర్లకు చెందిన రవికుమార్ రెడ్డి, ఆకాష్ రమేష్ జాదవ్,లు కలిసి పక్కా ప్రణాళికతో నకిలీ నోట్లను ముద్రిస్తున్నారు. వికారాబాద్‌కు చెందిన పాల్త్య కళ్యాణ్, ఎల్తం నరేడ్ల శంకర్,గోపాల్, ఎల్తం రవి,నరేడ్ల బాలయ్యలు కారులో వెళ్లి రూ. 4 లక్షల నకిలీ కరెన్సీని సేకరించారు.

ఇందులో కొంత మొత్తాన్ని ఇప్పటికే చలామణి చేయగా, మిగిలిన రూ. 2,08,500లను శంకర్ అనే వ్యక్తి.. రైతు చిన్న సాయిలుకు తెలియకుండానే అతడి ఇంట్లో దాచిపెట్టాడనీ తెలిపారు.

తెలియని అమాయకత్వంతో ఆ రైతు ఆ డబ్బును బ్యాంకుకు తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోయాడు.నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, బోధన్ బస్టాండ్ వద్ద నిందితులను మాటువేసి పట్టుకున్నారు.

నిందితుల నుంచి నకిలీ కరెన్సీ రూ. 9,86,000,2 ప్రింటర్లు, 1 ల్యాప్‌టాప్,8 సెల్ ఫోన్లు, బ్రీజా కారు (TS-16-ET-0111), బ్లేడ్లు, స్టీల్ స్కేల్స్, సెక్యూరిటీ థ్రెడ్ కోసం ప్లాస్టిక్ రోల్స్ లుస్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అలాగే ముఠా ప్రధాన సూత్రధారులతో పాటు సహకరించిన వారందరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments