పట్టించుకోని పాలకులుమున్సిపల్ అధికారులతో వాదనకు దిగిన కాలనీ వాసులు.నాగారం డంపింగ్ యార్డు కాలుష్య విషాన్ని చిమ్ముతోంది. గుట్టలుగుట్టలుగా పేరుకు పోయిన నిజామాబాద్ పట్టణం లోని నాగారం డంపింగ్‌యార్డు అధ్వానంగా తయారైంది.
ఈ డంపింగ్‌యార్డు వెదజల్లే దుర్గంధంతో ప్రజలను ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. డంపింగ్‌యార్డును ఇక్కడి నుండి పట్టణానికి దూరంగా తరలించాలని కొన్నేళ్లుగా ప్రజలు గగ్గోలు పెడుతున్నా.., పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదనీ ప్రజలు మండిపడ్డారు.
డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగ సగం పట్టణానికి వ్యాపిస్తోంది. ఈ పొగతో ఊపిరి తీసుకోనివ్వని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు దశాబ్దంన్నర క్రితం ఈ డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసిన సమయంలో ఆ ప్రాతం పట్టణానికి దూరంగా ఉండేది.
ప్రస్తుతం పట్టణం పెరిగి డంపింగ్‌యార్డు చెంతకే నివాస గృహాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న డంపింగ్‌యార్డ్‌లో కొన్నేళ్లుగా చెత్త పేరుకుపోయింది. దీంతో చెత్త కుళ్లి దుర్గంధం వెదజల్లుతోందనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం రాత్రి మున్సిపల్ అధికారులు నాగారంలోని డంపింగ్ యార్డు ను పర్యవేక్షించారు.
ఈ మేరకు చుట్టూ పక్కల ప్రాంతంలోనీ కాలనీ కేసులు అధికారులతో వాదనకు దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డు వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
కాగా వేసవి వచ్చింది మొదలు కొండలా పెరిగే చెత్తకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని నిత్యగ్నిహోత్రంగా తయారవుతుందని తెలిపారు. దీంతో పట్టణాన్ని పొగకమ్మేస్తూ ప్రజలకు ఊపిరాడకుండా చేస్తోంది.కొన్ని సందర్భాల్లో ఈ పొగ దెబ్బకు ఏరియా ఆస్పత్రిలోని పేషెంట్లకు కూడా ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది.
ఈ డంప్ యార్డ్ విషయంలో ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధి లు నిమ్మకునీరంటనట్టు ఉన్నారని విమర్శించారు. డంపింగ్ యార్డు కు అగ్ని ప్రమాదం కారణంగా ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నంలో చెత్త తడిసి తడిగా మారటం వలన దుర్గంధ్దం మరింత ఏక్కువవుతుందని అన్నారు.
మునిసిపల్ కమిషనర్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలోనివాసులు తెలియజేశారు.మంటలు, పొగతో కాలుష్యంవేసవి వచ్చిందంటే చాలు డంపింగ్ యార్డులో మంటలు చెలరేగుతున్నాయి.
అందులో నుంచి దుర్గంధభరితమైన దుర్వాసన, దట్టమైన పొగ వెలువడుతోంది. గాలిలో చిన్నచిన్న చెత్త రేణువులు కలిసి పరిసర ప్రాంతాల్లోకి వ్యాపిస్తున్నాయి.
చెత్తను వేగంగా శుద్ధి చేయడంతోపాటు తిరిగి ఇక్కడ చెత్త గుట్ట పేరుకుపోకుండా చెత్తను ఎక్కడికక్కడ తగ్గించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.