కర్రలతో దాడులు చేసుకున్న ఇద్దరివ్యక్తులు..నగరంలోని స్నూకర్ పార్లర్ వద్ద ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటన నగరంలో బుదవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని బోధన్ రోడ్డు లోకి ఫ్లవర్ స్కూల్ వద్ద ఉన్న స్నూకర్ పార్లర్ లో ఫిరోజ్ అనే వ్యక్తి స్నూకర్ ఆడుతున్నాడు.
ఆ క్రమంలోనే సాదక్,అద్నాన్, బసామ్,మరో వ్యక్తి నలుగురు కలిసి ఫిరోజ్ పై దాడి చేసి పరారయ్యారు.ఫిరోజ్ స్నూకర్ కర్ర పట్టుకుని పరుగు తీసి వారిని పట్టుకొని తలపై కొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో రెండు వర్గాల యువకులు కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
