.అదుపు తప్పి వడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటన శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే కంటేశ్వర్ బైపాస్ నుంచి కలూర్ వైపు వెళ్తున్నా ధాన్యం లారీ ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ఒక్క సారి అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.
