ప్రమాదవశాత్తు రైలు ఢీ కొనడంతో సుమారు వంద గోర్లు మృతి చెందాయి. ఈ తీవ్ర ఆవేదనతో గొర్ల కాపరి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
రైల్వే ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దేవునిపల్లికి చెందిన దర్శపు సుధాకర్(39) గొర్ల కాపరిగా పని చేస్తున్నాడు.ఆదివారం రైలు బండి రాకను గమనించకుండా తన గొర్లను రైలు పట్టాలు దాటిచుచుండగా రైలు బండి దాదాపు 100 గొర్లను ఢీ కొట్టగానే గోర్లు రైలు పట్టాల ప్రక్కన మృతి చెందినట్లు తెలిపారు.
దీంతో ఆయన ఆ గొర్ల మృతిని జీర్ణించుకోలేక సుధాకర్ అనే గొర్ల కాపరి పట్టాల ప్రక్కన గల కామారెడ్డి చెరువు వాగు లొ పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన పైన S. లింబాద్రి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
