HomeTelanganaNizamabadపార్టీలోనూ ఆయన దే ఆధిపత్యం .....డీసీసీ అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి నియామకం లో చక్రం తిప్పిన...

పార్టీలోనూ ఆయన దే ఆధిపత్యం …..డీసీసీ అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి నియామకం లో చక్రం తిప్పిన సుదర్శన్ రెడ్డి……..అర్బన్ లో మహేష్ ముద్ర

ప్రభుత్వవ్యవహారాల్లోనే కాదు పార్టీలోనూ ఆయనదే ఆధిపత్యం అనేది మరోసారి రుజువు చేసారు.దిగ్గజ నేత సుదర్శన్ రెడ్డి! తన సన్నిహితుడైన నగేష్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా నియామకం కావడం లో చక్రం తిప్పారు.

పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ఉన్న నేపథ్యం లో కూడా పార్టీ వ్యవహారాల్లో నూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.బాడ్సి మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్ వైపు మహేష్ మొగ్గు చూపినా అధిష్టానం మాత్రం నగేష్ రెడ్డి నే డీసీసీ గా నియమించింది.

క్యాబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ సలహాదారు పదవి తో ఇప్పటికే పాలనా వ్యవహారాల్లో పట్టు సాధించే పనిలో ఉన్న సుదర్శన్ రెడ్డి పార్టీ లో నూ తన మాటే నెగ్గే లా చేసుకున్నాడు.గతంలో డీఎస్ పీసీసీ చీఫ్ గా వుండగా తన సన్నిహితుడైన గడుగు గంగాధర్ ను డీసీసీ అధ్యక్షుడిగా చేశారు.

దీనితో మహేష్ సైతం శేఖర్ గౌడ్ కోసమే చక్రం తిప్పుతారని భావించారు. ఆ మేరకు ప్రయత్నం చేసిన మహేష్ చివరికి నగేష్ రెడ్డి విషయంలో వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గి నట్లు సమాచారం. కానీ అర్బన్ అధ్యక్ష పదవి విషయంలో మాత్రం తన మాట నెగ్గేలా చేసుకున్నారు.

నిజానికి డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానం నిర్దేశిత నియమావళి మేరకు శేఖర్ గౌడ్ నగేష్ రెడ్డి లు మాత్రమే అర్హులు గా నిలిచారు అరికెల ఆకుల లలితా లాంటి నేతలు పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు గా వుండడం తో వారిపేర్ల ను అసలు పరిగణలోకి తీసుకోలేదు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టికెట్ కోసం చివరి దాక గట్టిగా ప్రయత్నించిన నగేష్ రెడ్డి చివరికి అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లు భవిష్యత్తు హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు.

అందుకే డీసీసీ రేసు లో కి వచ్చిన నగేష్ రెడ్డి కోసం వారిద్దరూగట్టిగా నిలబడ్డారు మరో వీపు శేఖర్ కు డీసీసీ గా అవకాశం ఇవ్వాలని బావించిన తన సామాజికవర్గం కు ప్రాధాన్యత ఇచ్చాడనే అపవాదు వస్తుందని వెనుకాడారు.

మరో వైపు అసలే మంత్రి పదవీ తన వల్లే రాలేదని సుదర్శన్ రెడ్డి గుర్రుగా వుండడం తో మహేష్ డీసీసీ విషయం లో పట్టుదల కు వెళ్ళ లేక పోయారు అదీగాక నగేష్ రెడ్డి సైతం మొదటి నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్ననేపథ్యంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు తన సన్నిహితుడైన శేఖర్ గౌడ్ కు నామినేటెడ్ పోస్టు కోసం సిఫారస్ చేసే ఆలోచనలో ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments