అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నావిపేట్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
నవిపేట్ మండలంలోని అభంగపట్నం గ్రామానికి చెందిన అల్లె వినోద్ కుమార్. గత కొన్ని రోజులుగా అప్పులతో బాధ పడుతున్నారు.
తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి నవిపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి పేర్కొన్నారు.
