అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన ఘటన డిచ్ పల్లి మండలం లో చోటు చేసుకుంది.డిచ్ పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి (31).
గత 13 సంవత్సరాల క్రితం బాలస్వామితో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో అనుమానాస్పదంగా ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
తల్లి నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
