నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఆస్పత్రుల్లో డెంగ్యూ బారిన పడిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారికంగా ఇప్పటివరకు 617 కేసులు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయి.
డెంగ్యూ బారినపడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు పంజా విసురుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ బారిన పడిన రోగులను ఒకేరోజు ఇద్దరు మరణించడం కలకలం రేపుతుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతం నగర్ కు చెందిన ఓ యువకుడు మృతి చెందగా, మోపాల్ మండలం వెంకట్ రామ్ నాయక్ తండాకు చెందిన ఓ యువతీ మృతి చెందింది .
మృతి చెందిన యువతి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. చికిత్స పొందు ఆమె కన్ను మూయడంతో ప్రజలు కలవరపడుతున్నారు.
617 డెంగ్యూ కేసులో నమోదు కాగా ఒక్క నిజామాబాద్ డివిజన్లోనే 429 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అధికారిక లెక్కల ప్రకారం గా 617 మంది డెంగ్యూ బారిన పడగా అనధికారికంగా ఆ సంఖ్య వేలల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
డెంగ్యూ కేసులు నమోదైన పరిసరాల్లో వైద్యశాఖ అధికారులు పరీక్షలు నిర్వహిస్తూ రక్త నమూనాలు సేకరిస్తున్నారు. డెంగ్యూ పై అవగాహన కల్పిస్తున్నారు.
వ్యాధులు విధులు తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు.
