తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని ఇందుర్ దేవాలయ పరిరక్షణ కమిటీ..
ఆద్వర్యంలో శనివారం ధర్నా చౌక్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ..గత వైసీపీ ప్రభుత్వ హాయంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానిజాలపై విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పటేల్ ప్రసాద్,పిట్ల,స్వామి,పండు,కిషన్, నాని తదితరులు పాల్గొన్నారు.
