నాందేడ్ నుంచి గంజాయి తీసుకువచ్చి నిజామాబాద్ లో విక్రయిస్తున్న వ్యక్తినీ అరెస్ట్ చేసినట్లు రెండవ టౌన్ ఎస్ఐ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ అఫ్రోజ్ అలియాస్ రోడ్డ అఫ్రోజ్ శుక్రవారం నగరంలోని ఐటిఐ కాలేజ్ గ్రౌండ్ వద్ద సుమారు 210 గ్రాముల ఎండు గంజాయి అమ్ముతుండగా నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అలాగే ఇతనిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లో గంజాయి కి సంబంధించిన కేసులు 13 కు పైగా ఉన్నట్లు గుర్తించారు . కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముజాహిద్ తెలిపారు.
