ఆ గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. అందుకు దేవినవరాత్రి ఉత్సవావాలే స్ఫూర్తిగా నిలిచాయి. దేవి మత కు అలంకరించిన చీర ను వేలం పాట వేయడం ఆగ్రామంలో ఆనవాయితీ వస్తుంది.
తొమ్మిది రోజులపాటు అమ్మవారి కి అలంకారణగా ధరించే చీర దక్కించు కుంటే అంతా శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం అందుకే ఆ చీర కోసం జరిగే వేలం పాట లో పోటాపోటీగా పాల్గొంటారు.
కానీ అమ్మవారి ని నిత్యం భక్తి శ్రద్దలతో కొలిచే హిందువులు ఆ చీర కోసం పోటీ పడ్డారంటే అది మాములే కానీ ఈసారి వేలం ఆ చీరకోసం పోటీ పడిన వ్యక్తి ని చూసి అందరూ నిర్ఘాంత పోయారు.
అవునూ గ్రామానికి చెందిన ముస్లిం యండి అమీన్ ఈసారి అమ్మవారి చీర కోసం జరుగుతున్న వేలం పాట లో పాల్గొని అక్కడున్న భక్తులను ఆశ్చర్య పరిచారు.
అంతేకాదు మూడు వేల రూపాయలకు చీర కూడా దక్కించుకున్నారు .ఆ తర్వాత అమ్మవారి శోభాయాత్ర లో ను పాల్గొనడం గమనార్హం.
ఈ వేలం జరిగింది ఎక్కడో కాదు నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కల్లూరు గ్రామం లో ఆదివారం రాత్రి జరిగింది .
