చికిత్స పొందుతూ యువకుడు మృతి…కుక్క కాటుతో యువకుడు మృతి చెందిన ఘటన మక్లూర్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం…
మక్లూర్ మండలంలోనీ ఓడ్యాట్ పల్లి గ్రామానికి చెందిన నిరగొండ లింగం(36).భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు పీ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కుక్క కాటు వేసింది.
కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. అయినా వ్యాక్సిన్ ప్రభావం చూపలేదు దానితో ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది.
గమనించిన కుటుంబ సభ్యులు గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
