HomeCRIMEట్రాఫిక్ పోలీసు లకు చెన్నయ్ మాల్ …దసరా నజరానా లు …..స్వయంగా పంచిన ఏసీపీ …….

ట్రాఫిక్ పోలీసు లకు చెన్నయ్ మాల్ …దసరా నజరానా లు …..స్వయంగా పంచిన ఏసీపీ …….

పది రోజుల పాటు రద్దీ ప్రాంతాల్లో వాహనాల నియంత్రణ ను గాలికి వదిలేసి సేవలు చేసి నందుకు చెన్నయ్ షాపింగ్ మాల్ యాజమాన్యం ట్రాఫిక్ పోలీసు ఋణం తీర్చేసుకుంది.

భారీగా నజరానాలు ముట్టజెప్పింది. ఇదేదో గుట్టుచప్పుడు కాకుండా కాదు స్వయంగా ట్రాఫిక్ ఏసీపీ స్వయంగా ఆ నజరానాలు ట్రాఫిక్ లో పనిచేస్తున్న 30 మందికి పండగ నజరానా గా ఇచ్చేసారు.

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా చెన్నయ్ షాపింగ్ మాల్ సొమ్ము ఆ సార్ సిబ్బంది సమానంగా ఇచ్చే విషయంలోనూ పక్షపాతమే చూపారు.

తనకు నచ్చిన వారికి ముట్టజెప్పారట ! దసరా పండగకు పది రోజులముందు ప్రతి రోజు గంటల తరబడిగా చెన్నయ్ షాపింగ్ మాల్ ముందు ట్రాఫీక్ ఇబ్బందులు తలెత్తకుండా కనీసం ముగ్గురు కానిస్టేబుళ్లు రంగంలోకి దిగి సేవలు అందించారు.

కొనుగోలు చేయడానికి వచ్చే కస్టమర్ల వాహనాలు సుళువులు రోడ్డు దాటేలా ట్రాఫిక్ సిబ్బంది శ్రమించేవారు. నిజానికి దసరా పండగ రోజుల్లో నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులతో సామాన్య ప్రజానీకం సతమతం అయ్యారు.

వీక్లి మార్కెట్ గాంధీ, చౌక్ రైల్వే స్టేషన్ ,నిఖిల్ సాయి హోటల్ చౌరస్తా, కాంటేశ్వర్ ప్రాంతాల్లో పండగ మార్కెట్ కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.

ఇలాంటి రోజుల్లనే సమర్థవంతంగా విధులు నిర్వహించాల్సిన ట్రాఫిక్ పోలీసులు పది రోజులు కార్పొరేట్ షాపింగ్ మాల్స్ నిర్వాహకుల సేవలో తరించారు. ముందస్తు ఒప్పందాలు మేరకే ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్యూటీ లు చేసారనేది సమాచారం.

చలానా లపేరుతో సామాన్యప్రజల ఉసురు పోసుకొనే ట్రాఫిక్ పోలీసులు నగరంలో బడా షాపింగ్ మాల్స్ ల్లో వ్యాపార లావాదేవీలకు ఆటంకం రాకుండా కంటికి రెప్పలా కాపాడారు .

ఆయా మాల్స్ కోసం వచ్చే వాహనాలకు అసౌకర్యం కలగకుండా చెమటోడ్చారు గత వారం రోజులుగా ట్రాఫిక్ పోలీసులఆయా మాల్స్ ముందు చేసి ఓవర్ యాక్షన్ లు చూసి అంతా నివ్వెర పోయారు
బ్యాంకు ….ఆసుపత్రులు ….సూపర్‌ మార్కెట్‌ ల ముందు అయినా సరే వాహనాలు రోడ్ల మీద బారులు తీరుతె చాలు ఫొటో కొట్టి వెయ్యి…

అయిదు వందల జరిమానా వేసి తాట తీసి వసూళ్ల లక్ష్యం చేరుకొని సంబర పడే ట్రాఫిక పోలీసులు .

అదే కోట్ల రుపాయల వ్యయం తో కళ్ళు చెదిరే బహుళఅంతస్తుల్లో నిర్మాణాలు ….అందులో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యాపార లు అంతే స్థాయిలో వ్యాపార లావాదేవీలు ఒక్కో సీజన్‌ లో కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్న భారీ వస్త్ర వ్యాపారులకోసం సాగిలా పడడం సర్వత్రా చర్చ నియాంశం అయింది వస్త్ర వ్యాపారుల సేవకోసం తహతహ లాడుతున్నారు.

ఇతర ప్రాంతాల్లో ఏలా ఉన్న ఖలీల్‌ వాడి ప్రాంతంలో కిసాన్‌ అనగా చెన్నయ్ సౌత్ ఇండియా, వస్త్ర షాపింగ్‌ మాల్స్‌ ముందు ట్రాఫిక్ పోలీసులు కనీసం ఇద్దరు విధుల్లోఉన్నారంటే నిర్వాహుకులు ట్రఫిక్ పోలీసులను ఎలా మేనేజ్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు ..

ఈ సీజన్‌ లో కోట్ల రూపాయల లావాదేవీలు చేసుకునే మాల్స్‌ యజమానులు కనీసం పార్కింగ్‌ సదుపాయం కూడా లేకుండా నిర్మాణాలు చేసారు.మాల్స్‌ ముందు ఎదో మొక్కుబడిగా పార్కింగ్‌ స్థలము ఉన్నా సరే మరో రెండు వరుసలు రోడ్డు మీదే ఉంటున్నాయి.నిజానికి ట్రాఫిక పోలీసులు ఇక్కడ కూడా రోడ్డు మీద పార్కింగ్‌ చేసే వాహనాలకు జరిమానాలు వేస్తె మాల్స్‌ కు గిరాకీ దెబ్బ తింటుంది.

అందుకే ఈ మాల్స్‌ ముందు రోడ్ల మీద పార్క్‌ చేసిన వాహనాలకు జరిమానాలు వేయడం లేదుఎలాగో ప్రైవేట్ సెక్యూరిటీ ని ఎంగేజ్ చేసుకునే నిర్వాహుకులు రద్దీ ఉండేలా రోజుల్లో ట్రఫిక్ నియంత్రణ కోసం అదనపు సెక్యూరిటీ ను అందుబాటు లోకి తెచ్చుకోవాలి.దిశగా నిర్వాకులకు ట్రఫిక్ అధికారులే దిశానిర్దేశం చెయ్యాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments