.ప్రమాదవశాత్తు చేరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మాణిక్ భండార్ గ్రామ శివారులోని భీం చెరువులో సోమవారం చోటు చేసుకుంది.
ఎస్ఐ సుదీర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.మోపాల్ మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన సాయినాథ్(31)గత మూడు సంవత్సరాలుగా మాక్లూర్ మండల కేంద్రంలోని మాణిక్ భండార్ గ్రామంలో ఓ వ్యక్తి దగ్గర పశువుల కాపరిగా పనులు చేస్తున్నారు.
ఈ మేరకు రోజు వారీగా మేతకు పశువులను తీసుకొని వెళ్ళాడని పేర్కొన్నారు. పశువులు మాణిక్ భండార్ గ్రామ శివారులోని భీం చెరువులో కి వెళ్ళగా అది గమనించిన సాయినాథ్ ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతదేహాన్ని చెరువులోనుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుదీర్ రావు వెల్లడించారు.