Monday, December 8, 2025
HomeTelanganaNizamabadఆస్థి పన్ను వసూళ్ల నుంచి తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు ....రెగ్యులర్ ఉద్యోగులకే బాధ్యతలు .....ప్రభుత్వం ఆదేశాలు...

ఆస్థి పన్ను వసూళ్ల నుంచి తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు ….రెగ్యులర్ ఉద్యోగులకే బాధ్యతలు …..ప్రభుత్వం ఆదేశాలు …….నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 16 మంది తొలగింపు

తాత్కాలిక ఉద్యోగులకు ఆర్థిక అంశాలతో ముడిపడిన బాధ్యతలు ఇవ్వద్దని ప్రభుత్వం భావిస్తుంది. అవుట్ సోర్సింగ్ తాత్కాలిక సిబ్బంది ని పన్ను వసూళ్ల బాధ్యతల నుంచి ఉన్నపలంగా తప్పించాలని ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఉత్తర్వ్యూలు జారీచేశారు.

వారి నుంచి పన్ను జనరేట్ చేసే మిషన్ లను స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 16 మంది ని ఆయా బాధ్యతల నుంచి తప్పించబోతున్నారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆస్థి కుళాయి పన్ను వసూలు చేయడానికి కార్పొరేషన్ కు చెందిన బిల్ కలెక్టర్లు ఉన్నారు. కానీ నివాస సముదాయాలు నగరంలో భారీగా పెరగడంతో నిర్దేశిత గడువుగా ఆస్తి పన్ను వసూలు చేయడం మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగానికి తలకు మించిన భారంగా మారింది.

దీనితో అవుట్ సోర్సింగ్ ద్వార వందల మంది కార్పొరేషన్ లో ఆయా విభాగాల్లో పనిచేస్తుండడంతో వారిలో 16 మంది ని రెవెన్యూ విభాగంలోకి తీసుకోని వారికి అస్తి పన్ను వసూళ్ల బాధ్యతల్లో తీసుకున్నారు.ఇందులో 8 మందిని బిల్ కలెక్టరులుగా మరో 8 మందిని పన్ను వసూళ్ల విభాగంలో తీసుకున్నారు.

బిల్ కలెక్టర్లకు ఆస్తి పన్ను జనరేట్ చేసే మిషన్ లను కూడా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా వీరు ఈ విధుల్లో పనిచేస్తున్నారు. దీనితో రెగ్యులర్ ఉద్యోగులకు పనిభారం తగ్గడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది.

నిర్దేశిత లక్ష్యం మేరకు పన్ను వసూళ్ల జరుగుతున్నాయి. బకాయి బెడద కొంత మేరకు తగ్గింది. తాము సర్వీస్ ను రెగ్యులర్ చేయాలని కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు.

కానీ ఆయా మున్సిపాలిటీలో వీరు ఆర్థిక అవకతవకలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పిర్యాదులు వెలువెత్తుతున్నాయనే నేపం తో వీరందరిని ఆస్థి పన్ను వసూళ్ల నుంచి తొలగించి రెగ్యులర్ ఉద్యోగుల కే ఆస్థి పన్ను వసూళ్లబాధ్యతలు ఇవ్వాలని మున్సిపల్ డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆస్థి పన్ను వసూళ్లు చేసి దుర్వినియోగం చేసిన ఉదంతాల్లో సొమ్ము రికవరీ క్లిష్టంగా మారింది. అందుకే రెగ్యులర్ ఉద్యోగులతోనే ఆస్థి పన్ను వసూళ్లు చేయిస్తే రికవరీ సమస్యలు ఉండవనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

ఆస్థి పన్ను బాధ్యతల నుంచి తొలగించిన వారిని పారిశుధ్య నిర్వహణ లేదంటే సర్వే పనుల్లో తీసుకోవాలని స్పష్టం చేసారు. తమను ఆస్థి పన్ను విభాగం నుంచి అర్ధాంతరంగా తప్పించడం ఫై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!